jd chakravarti: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జేడీ చక్రవర్తి పాత్రపై క్లారిటీ ఇచ్చిన రాంగోపాల్ వర్మ!

  • చంద్రబాబు పాత్రను జేడీ పోషిస్తున్నాడని వార్తలు
  • ఖండించిన రాంగోపాల్ వర్మ
  • చంద్రబాబు పాత్ర ఎవరు చేస్తారో నిర్ణయించలేదన్న వర్మ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీయతలపెట్టిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో అత్యంత కీలకమైన చంద్రబాబునాయుడు పాత్రను జేడీ చక్రవర్తి పోషించనున్నాడని వచ్చిన వార్తలపై వర్మ స్పందించారు. తన చిత్రంలో చంద్రబాబు పాత్రను జేడీ పోషించడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా జేడీ ఆ పాత్రను పోషించడం లేదని అన్నాడు.

ఆ పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. తనకు, 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మధ్య ఎవరో నటిస్తున్నారని ఆరోపించాడు. వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబు ఏం చేశారన్న విషయం తనకు నిజంగా తెలియదని చెప్పాడు. కాగా, ఈ చిత్రం గురించి రాంగోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
jd chakravarti
ramgopal varma
lakshmi'sm ntr

More Telugu News