iyr krishnarao: రాజధాని అంటే సినిమా సెట్టింగు కాదు.. ప్రజలు నాశనం అయిపోతారు: ఐవైఆర్ కృష్ణారావు ఫైర్

  • రాజధాని నిర్మాణానికి సినీ దర్శకులు ఎందుకు?
  • ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలే నష్టపోతారు
  • సరైన ప్లానింగ్ లేకే అవాంతరాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. స్విస్ ఛాలెంజ్ విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని... సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పారు.

రాజధాని అంటే సినిమా సెట్టింగ్ కాదని... రాజధాని నిర్మాణానికి సినిమా దర్శకులు ఎందుకని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వస్తే ప్రజలే నష్టపోతారని... వారి జీవితాలు నాశనమవుతాయని అన్నారు. ప్రజలకు ఏది అవసరమో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
iyr krishnarao
chandrababu
amaravathi

More Telugu News