mohanbabu: మోహన్ బాబు బావ వెంకటాద్రినాయుడు మృతి.. నారావారిపల్లెలో అంత్యక్రియలు

  • తుదిశ్వాస విడిచిన మేడసాని వెంకటాద్రినాయుడు 
  • గుండెపోటుకు గురైన మోహన్ బాబు బావ
  • ఈ సాయంత్రం జరగనున్న అంత్యక్రియలు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి 8.30 గంటలకు ఆయన మృతి చెందారు. ఈ సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మోహన్ బాబు నటించిన పలు సినిమాలకు వెంకటాద్రినాయుడు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల కోశాధికారిగా కూడా ఆయన వ్యవహరించారు. వెంకటాద్రినాయుడి మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 
mohanbabu
venkatadri naidu
sri vidya nikethan
naravaripalle

More Telugu News