komatireddy venkatareddy: కేసీఆర్ కనికరం కోసం కాళ్లపై పడ్డ కోమటిరెడ్డి: గుత్తా ఫైర్

  • టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నించారు
  • కేసీఆర్ ఆయన్ని దూరం పెట్టారు
  • ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్నారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో చేరుతానంటూ వారం కిందటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ల మీద కోమటిరెడ్డి పడ్డారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే, కోమటిరెడ్డి కోతి చేష్టలతో ఇబ్బందులు వస్తాయని భావించిన కేసీఆర్ ఆయన్ని దూరం పెట్టారని చెప్పారు.

టీఆర్ఎస్ లో చేర్చుకోకపోవడంతో ఇప్పుడు 'ఛలో అసెంబ్లీ' పేరుతో కోమటిరెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని అన్నారు. ఇలాంటి వ్యక్తులను రైతులు నమ్మరాదని అన్నారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మంచివి కాదని తెలిపారు. వర్షాల కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని... అయితే, పత్తి కొనుగోలు కోసం సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.
komatireddy venkatareddy
gutha sukhender reddy
TRS
congress

More Telugu News