పేలిన జియో 4జీ ఫీచర్ ఫోన్.. ఖండించిన రిలయన్స్

- ఇటీవలే జనాల చేతుల్లోకి వచ్చిన 4జీ ఫీచర్ ఫోన్లు
- అంతలోనే కలవరపెడుతున్న పేలుడు వార్త
- దురుద్దేశపూరిత ప్రచారమన్న రిలయన్స్
జియో ఫోన్ పేలిందన్న వార్తను రిలయన్స్ ఖండించింది. తమ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు ఎవరో కావాలనే ఇలా చేశారని పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారుచేసిన ఈ ఫోన్ పేలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఫోన్‌ను పూర్తిగా పరీక్షించిన తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని పేర్కొంది.