hero vijay: హీరో విశాల్ ఇల్లు, కార్యాలయంపై జీఎస్టీ అధికారుల దాడులు

  • 'మెర్సల్' సినిమాకు విశాల్ మద్దతు
  • బీజేపీ నేతపై విమర్శలు
  • చర్చనీయాంశంగా మారిన జీఎస్టీ దాడులు
కోలీవుడ్ హీరో విశాల్ నివాసం, కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు దాడులు జరిపారు. ఏకకాలంటో జరిగిన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తమిళనాట దుమారం రేపుతున్న విజయ్ సినిమా 'మెర్సల్'కు విశాల్ నిన్న మద్దతు ప్రకటించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిపై కూడా విమర్శలు గుప్పించారు.

సినిమాలో జీఎస్టీ గురించి ఉన్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న తరుణంలో ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు 'మెర్సల్' సినిమాకు మద్దతు ప్రకటించినప్పటికీ... విశాల్ ఇంటిపై మాత్రమే దాడులు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
hero vijay
hero vishal
gst officers attacks
kollywood

More Telugu News