mersel movie: భావప్రకటన స్వేచ్ఛను బీజేపీ కాల రాస్తోంది!: 'మెర్సల్'కు పాండిచ్చేరి సీఎం మద్దతు

  • 'మెర్సల్' సినిమాకు పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి మద్దతు
  • పత్రిక, భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న బీజేపీ
  • గత ప్రభుత్వాలన్నీ ఈ స్వేఛ్ఛను కాపాడాయి

'మెర్సల్' సినిమాకి పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి మద్దతు పలికారు. భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛను గతంలోని రాజకీయ పార్టీలు, నేతలు కాపాడుకుంటూ వచ్చారని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ భావప్రకటనా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను హరిస్తోందని దుయ్యబట్టారు.

ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపై చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. కాగా, ఇప్పటికే ఈ సినిమాపై బీజేపీ నేతలు విమర్శలు చేయగా, సినీ ప్రముఖులతో పాటు, బీజేపీయేతర పక్షాలన్నీ మద్దతు పలుకుతున్నాయి. ఈ సినిమాలో జీఎస్టీ, స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియాపై విమర్శలు ఉన్నాయంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

More Telugu News