china: ఐఫోన్ కోసం బరితెగించిన యువతికి బుద్ధి చెప్పిన చైనా మహిళ!

  • స్మార్ట్ ఫోన్ కోసం కన్యత్వాన్ని విక్రయానికి పెట్టిన యువతి
  • బుద్ధి చెప్పాలని భావించిన బ్లాగర్
  • డీల్ కుదుర్చుకుని హోటల్ కి రప్పించిన బ్లాగర్

చైనాలో స్మార్ట్ ఫోన్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకునేందుకు యువత ఎంతకైనా తెగిస్తున్నారు. తల్లిదండ్రులను బెదిరించడం, చోరీలకు పాల్పడటం, దోపిడీలు చేయడం వంటి పనులకు కూడా వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఒక యువతి ఏకంగా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. దీంతో ఆమెకు మరో మహిళ గట్టిగా బుద్ధి చెప్పేలా చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఖరీదైన ఐఫోన్ 8 ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన క్సియో ఛాన్ అనే ఒక యువతి తన కన్యత్వాన్ని విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

 ఈ పోస్టును చూసిన నెనా అనే బ్లాగర్ కేవలం ఐఫోన్ కోసం కన్యత్వాన్ని పణంగా పెట్టడం అత్యంత నీచమనిపించింది. దీంతో ఆమెకు ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలని భావించింది. దీంతో ఆమెను ఫోన్ లో సంప్రదించింది. తాను ఒక సంస్థలో పని చేస్తున్నానని, తన బాస్ ఐఫోన్ కొనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ఆయనకు సహకరించాలని సూచించింది. దీనికి ఆమె సరే అనడంతో డీల్ కుదిరింది. తన బ్లాగ్ లో పని చేసే ఉద్యోగిని బాస్ మాదిరిగా ఆమె ఉన్న హోటల్ గదిలోకి పంపింది. అతను నెనా చెప్పినట్టే చేసి, ఆమెకు ఐఫోన్ బాక్స్ ఇచ్చేశాడు.

 దీంతో సులువుగా ఐఫోన్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న క్సియో ఛాన్ కు షాక్ ఇస్తూ, కండలు తిరిగిన ఇద్దరు యువకులు ఆమె గదిలోకి ప్రవేశించి, వస్తూనే ఆమెను ఒడిసిపట్టుకుని, మంచానికి కట్టేసి వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆ ఫోన్ ను నెనా బాస్ గా నటించిన వ్యక్తికి ఇచ్చేసి, తనను ఏమీ చేయవద్దని ఏడుస్తూ వేడుకుంది. దీంతో బయటకు వచ్చిన నెనా, ఫోన్ కోసం దిగజారడం దారుణమని, అది చాలా తప్పని చెప్పేందుకే ఇలా చేశామని తెలిపింది. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయనని ప్రమాణం చేయించుకుని ఆమెను వదిలిపెట్టింది. 

More Telugu News