team India: టీ20 సిరీస్ కు కోహ్లీ ఔట్... రోహిత్ కు కెప్టెన్సీ?

  • కోహ్లీ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన కివీస్
  • విశ్రాంతి కావాలని కోరిన కోహ్లీ?
  • టీ20 సిరీస్ కు కోహ్లీ దూరం
  • కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మకు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోనున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జోరుమీదున్న కోహ్లీ జైత్రయాత్రకు న్యూజిలాండ్ జట్టు బ్రేక్ వేసింది. టీమిండియాతో ముంబైలో జరిగిన తొలి వన్డేలో అన్నిరంగాల్లో భారత జట్టుకంటే మెరుగ్గా ఆడిన కివీస్ విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ జట్టుగా నీరాజనాలు అందుకున్న ఆసీస్ జట్టుకు సాధ్యం కాని విజయాన్ని కివీస్ అందుకుని సిరీస్ లో ముందడుగు వేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పటిష్ఠ విజయ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. దీంతో కోహ్లీ చేసిన సెంచరీ వృథాగా మారింది. ఈ నేపథ్యంలో విరామం లేకుండా క్రికెట్ ఆడిన కోహ్లీ అలసిపోయాడన్న కారణంతో, కివీస్ తో టీ20 సిరీస్ కు దూరం కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చి, కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తీవ్రమైన ఒత్తిడి నుంచి కోహ్లీకి కొంత విశ్రాంతి లభిస్తుందని టీమిండియా భావిస్తోంది. 

More Telugu News