pawankalyan: పవన్ కల్యాణ్ కు ఎదురెళ్లి స్వాగతం పలికిన ఎన్టీఆర్!

  • నేడు ప్రారంభమైన ఎన్టీఆర్ కొత్త చిత్రం
  • దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
  • ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కల్యాణ్
  • స్వాగతం పలికి పలకరించిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌ లో ఈ ఉదయం రామానాయుడు స్టూడియోస్‌ లో ఓ చిత్ర ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. సినిమా పూజా కార్యక్రమాలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రాగా, హీరో ఎన్టీఆర్ స్వయంగా పవన్ కు ఎదురెళ్లి, ఆత్మీయ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఆపై కాసేపు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లాడారు. పవన్ చేతుల మీదుగా సినిమా ప్రారంభం అయింది.

ఈ నేపథ్యంలో రామానాయుడు స్టూడియోస్‌ లో సందడి నెలకొంది. వందలాది మంది ఎన్టీఆర్, పవన్, త్రివిక్రమ్ అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, కుమారుడు అభయ్‌ రామ్ లు సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ (వై దిస్ కొలవెరి ఫేం) తదితరులు హాజరయ్యారు. అనిరుథ్ సంప్రదాయ తమిళ వేషధారణలో ఎరుపు రంగు ధోవతి, తెలుపు రంగు కుర్తా ధరించి వచ్చాడు.
pawankalyan
ntr
trivikram srinivas
new movie

More Telugu News