ss rajamouli: 'సాహో' ఫస్ట్ లుక్ పై రాజమౌళి స్పందన

  • ఫస్ట్ లుక్ పై రాజమౌళి ట్వీట్
  • అదిరిపోయిందంటూ ప్రశంస
  • కలర్స్, టెక్స్చర్స్ అద్భుతంగా వాడారంటూ కితాబు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ఈ ఫస్ట్ లుక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. దర్శకదిగ్గజం రాజమౌళి 'సాహో' ఫస్ట్ లుక్ పై స్పందించారు. కలర్స్, టెక్స్చర్స్ ను అద్భుతంగా వాడారని కితాబిచ్చారు. 'సూపర్ స్టైలిష్ సాహో' అంటూ ట్వీట్ చేశారు.

దాదాపు నాలుగేళ్లపాటు మరో ఆలోచన లేకుండా రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ 'బాహుబలి' సినిమా కోసం పని చేశారు. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో 'సాహో' ఫస్ట్ లుక్ పట్ల జక్కన్న చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 
ss rajamouli
tollywood
saaho first look
prabhas

More Telugu News