mersal movie: జాతీయ స్థాయి నేత అయివుండి.. పైరసీ సినిమా చూశావా? సిగ్గులేదూ?: బీజేపీ నేతపై హీరో విశాల్ మండిపాటు

  • పైరసీ సినిమా చూశానన్న బీజేపీ నేత
  • మండిపడ్డ విశాల్
  • పెద్దమనిషిగా ఉంటూ ఇదేం పని అంటూ ఆగ్రహం
హీరో విజయ్ తాజా చిత్రం 'మెర్సెల్' రాజకీయపరంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. జీఎస్టీకి సంబంధించి ఈ సినిమాలో ఉన్న డైలాగులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను 'మెర్సెల్' పైరసీ కాపీని చూశానని... సినిమాలోని డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై హీరో విశాల్ మండిపడ్డాడు. ఒక జాతీయ నేత స్థాయిలో ఉండి పైరసీ సినిమా చూశానని చెప్పడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంఘంలో పెద్దమనిషిగా ఉంటూ, పైరసీ సినిమా చూశానని చెప్పడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించాడు. ఇలాంటి పని చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని... పైరసీ లింకులను తొలగించడానికి ప్రభుత్వానికి సహకరించాలని డిమాండ్ చేశాడు. మరో సీనియర్ నటుడు పార్తీబన్ కూడా హెచ్ రాజా వ్యాఖ్యలను తప్పుబట్టారు. 
mersal movie
hero vishal
hero vijay
kollywood
vishal fires on bjp leader

More Telugu News