pelli chupulu: `పెళ్లి చూపులు` త‌మిళ రీమేక్‌లోనూ ప్రియ‌ద‌ర్శి!

  • త‌మ‌న్నా హీరోయిన్
  • నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న గౌత‌మ్ మీన‌న్‌
  • న‌వంబ‌ర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభం

చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ట‌యిన `పెళ్లిచూపులు` చిత్రంలో ప్రియ‌ద‌ర్శి పోషించిన కౌశిక్ పాత్ర సినిమాకు పెద్ద హైలైట్‌. ఇదే పాత్రను ఈ సినిమా త‌మిళ రీమేక్ `పొన్ ఒండ్రు కాందేన్‌`లో కూడా ప్రియ‌ద‌ర్శి పోషించనున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ మాండ‌లికంలో డైలాగులను త‌న శైలిలో ప‌లుకుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ప్రియ‌ద‌ర్శి త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడ‌ని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

ఇటీవ‌ల మ‌హేశ్ బాబు `స్పైడ‌ర్‌` చిత్రం ద్వారా ప్రియ‌ద‌ర్శి త‌మిళ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టాడు. గౌత‌మ్ మీన‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో నాయిక‌గా త‌మ‌న్నా న‌టించ‌నుంది. విష్ణు విశాల్ హీరోగా న‌టించనున్నాడు. సెంథిల్ వీర‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ రెండో వారంలో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News