telangana bjp: తెలంగాణ బీజేపీ నేతల అత్యవసర భేటీ.. రేవంత్, నాగంలపై చర్చ!

  • మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చ
  • రేవంత్, నాగంల గురించి ప్రధాన చర్చ
  • సమావేశానికి కీలక నేతలు హాజరు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో నేడు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే విషయంపై చర్చించారు. 
telangana bjp
nagam janardhan reddy
revanth reddy
telangana politics

More Telugu News