ysrcp: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వైసీపీ నేత, ఆయన తల్లి

  • బెంగళూరుకు వెళుతుండగా యాక్సిడెంట్
  • తవణంపల్లి మండలం మారేడుపల్లి వద్ద ప్రమాదం
  • నలుగురు కుటుంబసభ్యుల పరిస్థితి విషమం
ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా వైసీపీ నేత విద్యాసాగర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే కాణిపాకంకు చెందిన విద్యాసాగర్ రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కుమారులు, కోడలుతో కలసి బెంగళూరుకు ఈ ఉదయం బయల్దేరారు. రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత తవణంపల్లి మండలం మారేడుపల్లి వద్ద వారి కారు అదుపుతప్పి, కల్వర్టును ఢీకొంది.

ఈ ఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మిగిలిన నలుగురు కుటుంబసభ్యుల పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని రాయవేలూరు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ysrcp
ysrcp leader dead
chitoor dist

More Telugu News