actor vijay: హీరో విజయ్ కు మద్దతుగా నిలిచిన కమలహాసన్!

  • వ్యవస్థపై విమర్శలు చేసే హక్కు అందరికీ ఉంటుంది
  • సమస్యలను ఎత్తి చూపాల్సిందే
  • సెన్సార్ అయిన తర్వాతే సినిమా రిలీజ్ అయింది
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మెర్సల్' మూవీ బాక్సాఫీసును కొల్లగొడుతోంది. ఇదే సమయంలో ఈ సినిమాపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీపై ఈ సినిమాలో ఉన్న డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్న ఈ డైలాగులను తక్షణమే తొలగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, హీరో విజయ్ కు విలక్షణ నటుడు కమలహాసన్ మద్దతుగా నిలిచారు. అన్ని విధాలుగా సెన్సార్ అయిన తర్వాతే, ఈ సినిమా రిలీజ్ అయిందని ఆయన అన్నారు. వ్యవస్థపై విమర్శలు చేసే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని అన్నారు. బీజేపీ నేతలు వివాదాస్పదంగా భావిస్తున్న సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 
actor vijay
kamal haasan
kollywood
mersal movie
kamal backs vijay

More Telugu News