yuvaraj singh: యువరాజ్ పేరు వాడుకుని డబ్బులు వసూలు చేయాలని చూస్తోంది: ఆకాంక్షపై యువరాజ్ తల్లి ఆగ్రహం

  • కోడలిపై మండిపడిన యువరాజ్ సింగ్ తల్లి
  • ప్రతిసారీ యువీ అరెస్టయ్యాడా? అన్న ప్రశ్నలతో చిత్రవధ అనుభవిస్తున్నాం
  • ఆకాంక్ష పెట్టిన గృహహింస కేసు విచారణ నేడే ప్రారంభం
టీమిండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పేరును పాడు చేసే ప్రయత్నం చేస్తోందని తన కోడలు ఆకాంక్షపై అతని తల్లి షబ్నమ్‌ సింగ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, యువరాజ్ కి, ఈ కేసుకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆకాంక్ష యువరాజ్ సోదరుడు జొరావర్‌ సింగ్‌ భార్య మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రతిసారీ యువీ అరెస్టయ్యాడా? అంటూ వస్తున్న ప్రశ్నలతో చిత్రవధ అనుభవిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత వరకు పలు ఇంటర్వ్యూల్లో యువీ తనకు సోదరుడిలా ఉండేవాడని ఆకాంక్ష చెప్పిందని ఆమె గుర్తు చేశారు. అలాంటి యువరాజ్ పై ఆమె కేసు పెట్టే ప్రయత్నం చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువరాజ్ పేరు వాడుకుని డబ్బులు వసూలు చేయాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. అందుకే తమ కుటుంబంపై ఆకాంక్ష గృహహింస కేసు నమోదు చేయించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆకాంక్ష ఫిర్యాదు మేరకు గురుగ్రామ్‌ పోలీసులు యువీ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నేడే పోలీసు విచారణ ప్రారంభం కానుంది. 
yuvaraj singh
shabnam singh
joraver singh
akanksh sharma

More Telugu News