allari naresh: అల్లరి నరేశ్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు!

  • నిరాశ పరిచిన 'మేడమీద అబ్బాయి' 
  • తదుపరి సినిమాపై దృష్టి పెట్టిన అల్లరి నరేష్ 
  • దర్శకుడిగా సత్తిబాబు
  • త్వరలో సెట్స్ పైకి    
అల్లరి నరేశ్ చాలా వేగంగా సినిమాలు చేస్తూ వచ్చాడు. హాస్య కథానాయకుడిగా ప్రేక్షకుల మనసును దోచేసుకుంటూ చకచకా 50 సినిమాలను పూర్తి చేసేశాడు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన హిట్ పడటం లేదు. రీసెంట్ గా చేసిన 'మేడ మీద అబ్బాయి' టైటిల్  బాగుండటంతో, ఈ సారి సక్సెస్ తప్పదని అభిమానులు అనుకున్నారు. కానీ మళ్లీ ఆయనకి నిరాశే ఎదురైంది.

 ఈ నేపథ్యంలో ఈ సారి హిట్ కొట్టాల్సిందే అనే గట్టి పట్టుదలతో ఆయన రంగంలోకి దిగుతున్నాడు. తాజాగా ఆయన దర్శకుడు సత్తిబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'యముడికి మొగుడు' .. 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రాలు నరేశ్ అభిమానులను అలరించాయి. ప్రస్తుతం మంచు విష్ణుతో 'ఓటర్' సినిమాను నిర్మిస్తోన్న వారే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇక అల్లరి నరేశ్ ఆశలన్నీ సత్తిబాబు సినిమాపైనే ఉన్నాయనేది ఫిల్మ్ నగర్ టాక్.             
allari naresh

More Telugu News