గర్భా నృత్యం చేస్తున్న 97 ఏళ్ల వృద్ధురాలు... మోదీ తల్లిగా భ్రమపడిన కిరణ్‌బేడీ
- తప్పు తెలుసుకుని మరో ట్వీట్
- సద్గురు జగ్గీవాసుదేవ్‌ను ట్యాగ్ చేసిన కిరణ్
- ఆ వయసులో తాను కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నట్లు వెల్లడి
`97 ఏళ్ల వయసులో తన ఇంట్లో దీపావళిని ఆస్వాదిస్తున్న ప్రధాని తల్లి హీరాబెన్` అని ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఇషా ఫౌండేషన్ సద్గురు జగ్గీవాసుదేవ్‌ను ఆమె ట్యాగ్ చేశారు. తర్వాత కొన్ని గంటలకు ఆ వీడియోలో ఉన్నది నరేంద్రమోదీ తల్లి కాదని తెలిసి కిరణ్ బేడీ మరో ట్వీట్ చేశారు. `ఆమెను తప్పుగా గుర్తించాను. ఏదేమైనా ఆమె స్థైర్యానికి వందనాలు. 96 ఏళ్ల వయసులో నేను కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నాను` అని కిరణ్ ట్వీట్ చేశారు.
Spirit of Deepavali at tender age of 97. She's mother of @narendramodi (Hiraben Modi -1920) celebrating Diwali at her own home@SadhguruJV pic.twitter.com/HBXAzNXomC
— Kiran Bedi (@thekiranbedi) 20 October 2017
Am informed it's mistaken identity @SadhguruJV. But salute to the mother with so much vigour. I hope i can be like her if/ when I am 96..! https://t.co/5llHN40tg8
— Kiran Bedi (@thekiranbedi) 20 October 2017