harvey weinstein: హార్వీ వీన్‌స్టెయిన్ ప్ర‌వ‌ర్త‌న గురించి ఈ ద‌ర్శ‌కుడికి ముందే తెలుసట‌!

  • అంగీక‌రించిన క్వింటెన్ టారంటినో
  • అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయాల్సింది
  • అత‌నితో ప‌నిచేయ‌కుండా ఉండాల్సింది
కొన్నేళ్లుగా పలువురు సినీ తారలపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ ప్ర‌వ‌ర్త‌న గురించి త‌న‌కు ముందే తెలుసున‌ని ద‌ర్శ‌కుడు క్వింటెన్ టారంటినో తెలిపాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాల‌ను అంగీక‌రించాడు.

`నాకు చాలా విష‌యాలు తెలుసు. వాటిని అడ్డుకునే సామ‌ర్థ్యం ఉన్నా నేను అడ్డుకోలేదు. పుకార్లు, గాసిప్‌ల‌కు మించిన విష‌యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటికి అత‌ను (హార్వీ) బాధ్యుడని నాకు తెలుసు` అని క్వింటెన్ వెల్ల‌డించాడు.

హార్వీ గురించి త‌న‌కు ఇలాంటి విష‌యాలు తెలిసిన‌పుడే తాను అత‌నితో ప‌ని చేయ‌కుండా ఉండి ఉంటే బాగుండేద‌ని క్వింటెన్ అన్నారు. న‌టి రోస్ మెక్‌గువాన్‌తో హార్వీకి జ‌రిగిన సెటిల్‌మెంట్ కూడా త‌న‌కు తెలుసున‌ని క్వింటెన్ ఒప్పుకున్నాడు. అయితే అప్పుడు జ‌రిగిన విష‌యాలన్నీ చాలా చిన్న విష‌యాల‌ని తాను భ్ర‌మ‌ప‌డిన‌ట్లు క్వింటెన్ తెలిపాడు. `రిజ‌ర్వాయ‌ర్ డాగ్స్‌`, `ప‌ల్ప్ ఫిక్ష‌న్‌`, `కిల్ బిల్‌`, `ఇంగ్లోరియస్ బాస్ట‌ర్డ్స్‌`, `ద హేట్‌ఫుల్ ఎయిట్‌` చిత్రాల‌కు క్వింటెన్‌, హార్వీ వీన్‌స్టెయిన్‌లు క‌లిసి ప‌నిచేశారు.
harvey weinstein
hollywood
producer
quentin tarnatino
pulp fiction
inglorious bastards
kill bil

More Telugu News