resham khan: మోడల్ రేషమ్ ఖాన్ పై యాసిడ్ దాడి... దాడికి ముందు, ఆ తరువాతి ఫోటోలు ఇవిగో!

  • 21వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని వెళుతుండగా దాడి
  • దారుణంగా గాయపడిన మోడల్ రేషమ్
  • నేరాన్ని అంగీకరించిన నిందితుడు

తన 21వ పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరుపుకుని, లండన్ లో నిత్యమూ రద్దీగా ఉండే ఓ వీధిలో తన స్నేహితుడితో కలసి వెళుతున్న మోడల్ రేషమ్ ఖాన్ పై ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేయడంతో ఆమె దారుణంగా గాయపడింది. కాగా, ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు లండన్ డిటెక్టివ్ సూపరింటెండెంట్ నీల్ మ్యాథ్యూస్ వెల్లడించారు.

25 ఏళ్ల ఓ యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడని, అతను నేరాన్ని అంగీకరించాడని, ఈ నెల 27 నుంచి కేసు విచారణ జరుగుతుందని తెలిపారు. రేషమ్ ఖాన్ ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయని, సుదీర్ఘ కాలం గాయాలకు చికిత్స జరగాల్సి వుందని తెలిపారు. ఈ ఘటన జరిగిన తరువాత, తన ఫోటోలను అభిమానులతో పంచుకున్న రేషమ్ ఖాన్, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచి, ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు వెల్లడించింది. యాసిడ్ దాడికి ముందు, ఆ తరువాతి రేషమ్ ఖాన్ ఫోటోలను చూడవచ్చు.
యాసిడ్ దాడి తరువాత ఆసుపత్రిలో రేషమ్ ఖాన్

More Telugu News