sj surya: ఎస్. జె. సూర్య శాడిస్ట్ విలన్ గా మరోసారి అదరగొట్టేశాడట!

  • 'స్పైడర్'లో విలన్ గా ఎస్. జె. సూర్య 
  • 'మెర్సెల్'లోను అదే తరహా పాత్ర 
  • ఆడియన్స్ నుంచి ప్రశంసలు 
  • లైన్లో మరిన్ని విలన్ పాత్రలు  
తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా తనకంటూ మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఎస్.జె. సూర్య, ఆ తరువాత నటనకి ప్రాధాన్యతనిచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'స్పైడర్' సినిమాలో శాడిస్ట్ విలన్ గా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోయినా, ఆయన నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత ఆయన విలన్ గా నటించిన 'మెర్సెల్' కూడా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో విలన్ గా ఆయన చూపిన నటనకు ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. విలన్ పాత్రను ఆయన ఈ రేంజ్ లో చేస్తాడని అనుకోలేదంటూ హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ తో చేస్తోన్న సినిమాలోనే కాకుండా, మరో రెండు తమిళ సినిమాల్లోను ఆయన విలన్ పాత్రలను చేస్తున్నాడు. తెలుగులోను ఆయన బలమైన విలన్ గా మారే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.  
sj surya

More Telugu News