srija: కూతురు నివృతి, భర్త కల్యాణ్ తో చిరంజీవి కూతురు శ్రీజ.. ఫొటోను తొలిసారిగా షేర్ చేసిన శ్రీజ... చూడండి!

  • శ్రీజ కూతురు పేరు నివృతి
  • నివృతి, భర్త కల్యాణ్ తో కెమెరాకు పోజు 
  • త్వరలో హీరోగా కల్యాణ్ తెరంగేట్రం

చిరంజీవి కుమార్తె శ్రీజ తన భర్త కల్యాణ్, బిడ్డ నివృతి (మొదటి భర్త శిరీష్ తో కలిగిన బిడ్డ)తో కలసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గత సంవత్సరం మార్చిలో ప్రవాస వ్యాపారవేత్త కల్యాణ్ ను పెళ్లి చేసుకుని, వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న శ్రీజ, ఇలా భర్త, కుమార్తెతో కలసి ఫొటోకు పోజు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, త్వరలో కల్యాణ్ హీరోగా తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది, ప్రస్తుతం డ్యాన్స్, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకుంటున్న కల్యాణ్ కు ఎలాగూ మెగా అభిమానుల మద్దతు ఉంటుంది. ఎటొచ్చీ కావాల్సింది కాస్తంత టాలెంటేనని సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక శ్రీజ షేర్ చేసిన ఫొటోను మీరూ చూడవచ్చు.

More Telugu News