america: అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ.. ముగ్గురి కాల్చివేత

  • మేరీల్యాండ్‌‌‌లో కాల్పుల కలకలం
  • పరారీలో నిందితుడు.. రాడీ ప్రిన్స్‌గా గుర్తింపు
  • క్షతగాత్రుల పరిస్థితి విషమం

కాల్పులు నిత్యకృత్యమైన అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. బుధవారం ఉదయం మేరీల్యాండ్ ఆఫీస్ పార్క్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని 37 ఏళ్ల రాడీ లబీబ్ ప్రిన్స్‌గా పోలీసులు గుర్తించారు. హ్యాండ్‌ గన్‌తో కాల్పులు జరిపిన అనంతరం ప్రిన్స్ పరారైనట్టు హార్‌ఫోర్డ్ కౌంటీ షరీఫ్ జెఫ్రీ గాహియెర్ తెలిపారు. కాల్పుల వెనకున్న ఉద్దేశం తెలియరాలేదని పేర్కొన్నారు.

నిందితుడు అడ్వాన్స్ గ్రానైట్ సొల్యూషన్స్‌లో గత నాలుగు నెలలుగా మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్టు యజమాని బారక్ కబా తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News