ajay: థ్రిల్లర్ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజయ్

  • అజయ్ ప్రధాన పాత్రగా 'స్పెషల్' 
  • ప్రేమ .. ప్రతీకారం .. ఫాంటసీ నేపథ్యం 
  • హాలీవుడ్ తరహా స్క్రిప్ట్ ప్రధాన బలం
  • 'క్లైమాక్స్ మినహా చిత్రీకరణ పూర్తి        

అజయ్ .. పేరు వినగానే గుర్తుకు వచ్చేది 'విక్రమార్కుడు' సినిమాలోని విలన్. ఆ పాత్రలో ఆయన అంత అద్భుతంగా నటించాడు. ఆ తరువాత విలన్ పాత్రలతో పాటు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నారు. ఇక 'సారాయి వీర్రాజు' .. 'దిక్కులు చూడకు రామయ్య' సినిమాల్లో హీరోగా ఆయన మెప్పించారు. అలాంటి అజయ్ ప్రధాన పాత్రగా 'స్పెషల్' అనే సినిమా తెరకెక్కుతోంది.

 వాస్తవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ మినహా చిత్రీకరణను పూర్తి చేసుకుందని దర్శకనిర్మాతలు చెప్పారు. ప్రేమ .. ప్రతీకారం .. ఫాంటసీ అనే మూడు అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని అన్నారు. హాలీవుడ్ మూవీస్ తరహాలో ఈ సినిమా స్క్రిప్ట్ ఉంటుందనీ, త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ సినిమాతో అజయ్ క్రేజ్ మరింతగా పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.       

More Telugu News