జియోను చాలెంజ్ చేస్తున్న భారత్-1... ఆధిపత్యంపై దెబ్బకొడతామంటున్న మైక్రోమ్యాక్స్!
- 50 కోట్ల మంది గ్రామీణులే లక్ష్యం
- తొలుత కట్టాల్సింది రూ. 2,200
- ఆపై నెలకు రూ. 97 మాత్రమే
- జియోతో పోలిస్తే నికర వాడకం ధర తక్కువే
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ తో పోలిస్తే భారత్-1 చాలా చౌకగా వచ్చినట్టని నిపుణులు వ్యాఖ్యానించారు. రెండేళ్ల కాలానికి జియో వాడుకుంటే, రూ. 5,172 అవుతుందని, భారత్-1కు రూ. 4,528 మాత్రమే అవుతుందని, ఇక మూడేళ్ల కాలపరిమితికి పరిశీలిస్తే, జియో ఫోన్ కు రూ. 6,008 వెచ్చించాల్సి రాగా, భారత్-1కు రూ. 5,692 మాత్రమే అవుతుందని తేల్చి చెబుతున్నారు.
కాగా భారత్-1 ఫీచర్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ రామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2.4 అంగుళాల స్క్రీన్, 2 ఎంపీ/ వీజీఏ కెమెరాలు, భారత భాషలకు సపోర్ట్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలు ఉన్నాయి. ఇందులో ఎటువంటి యాప్ కావాలన్నా ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వుంటుంది. ఇక ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో జియో కన్నా, వేగంగా ప్రాచుర్యంలోకి వస్తుందని, బీఎస్ఎన్ఎల్ కు ఉన్న నెట్ వర్క్ అందుకు సహకరిస్తుందని టెలికం సెక్టార్ భావిస్తోంది.