donald trump: హైద‌రాబాద్ బాణాసంచా దుకాణంలో ట్రంప్ ను పోలిన వ్యక్తి... వైర‌ల్ అవుతున్న ఫొటో!

  • ఉస్మాన్ గంజ్‌లో డొనాల్డ్ ట్రంప్‌ ను పోలిన వ్యక్తి 
  • ఉత్త‌ర కొరియా మీద వేయ‌డానికి రాకెట్ కొన‌డానికి వ‌చ్చిన‌ ట్రంప్‌
  • సోష‌ల్ మీడియాలో పేలుతున్న జోకులు

దీపావ‌ళి సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. బాణాసంచా కొన‌డానికి ఉస్మాన్ గంజ్‌లో ఓ బాణాసంచా దుకాణానికి కూడా వెళ్లాడు. ఇదంతా ఎప్పుడు, ఎక్క‌డ‌ జ‌రిగింది అనుకుంటున్నారా?... ఇవాళే... సోష‌ల్ మీడియాలో జ‌రిగింది. అచ్చం డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా ఉన్న వ్య‌క్తి బాణాసంచా దుకాణంలో నిలబడి ఉన్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది.

ఈ ఫొటో మీద నెటిజ‌న్లు త‌మ హాస్య‌చ‌తుర‌త‌ను ప్రదర్శిస్తున్నారు. `ఉత్త‌ర కొరియా మీద వేయ‌డానికి రాకెట్ కొన‌డానికి ట్రంప్ ఇండియా వ‌చ్చాడు`, `రాకెట్ త‌యారు చేసే విధానం నేర్చుకోవ‌డానికి వ‌చ్చాడు` అంటూ జోకులు పేలుస్తున్నారు.

More Telugu News