Dubai: స్టార్ వార్స్ రోజులొచ్చేశాయి... రోడ్లపై సందడి చేయనున్న ఎగిరే బైక్ లు!

  • స్టార్ వార్స్ సినిమాలో గాల్లో ఎగిరే బైకులు, కార్లు
  • దుబాయ్ పోలీసులకు గాల్లో ఎగిరే బైకులు 
  • రెస్య్యూ ఆపరేషన్ లో వేగంగా పాలుపంచుకునే అవకాశం ఉందంటున్న పోలీసులు

హాలీవుడ్ లో విజయం సాధించిన సార్ట్ వార్స్ సినిమా చూశారా? ఆ సినిమాలో బైకులు, కార్లు వంటి వాహనాలన్నీ గాల్లో ఎగురుతూ ఉంటాయి. అచ్చం అలా గాల్లో ఎగిరే బైకులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వివిధ దేశాల్లోని మెట్రో నగరాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. అలాగే దొంగతనాలు, ప్రమాద సమయాల్లో బాధితులకు సాయమందించేందుకు ఆలస్యమవుతుంటుంది. అందుకే, ఎగిరే బైకులు వుంటే ఇలాంటి అవాంతరాలను ఇట్టే అధిగమించవచ్చని చాలామంది అనుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో దుబాయ్ లో ప్రయోగాత్మకంగా ఇలాంటి ఫ్లైయింగ్ బైక్ ను పోలీసులకు అందజేశారు.

 ఈ బైక్ కు 'స్కార్పియో' అనే పేరు పెట్టారు. ఈ బైక్ కు అన్ని వైపులా కెమెరాలు ఉంటాయి. 25 నిమిషాల్లో 64 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ బైక్ 272 కేజీల బరువు ఉంటుంది. దీనిని రష్యాకు చెందిన 'హోవర్ బైక్స్' అనే సంస్థ తయారు చేసింది. నాలుగు వైపులా ప్రొఫెల్లర్ లతో పాటు నాలుగు బ్లేడ్ లను అమర్చారు. సింగిల్ డ్రైవర్ ప్రయాణించే ఈ బైక్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ సమయంలో సహాయమందించేందుకు ఈ బైక్ లు ఎంతో ఉపయోగపడతాయని దుబాయ్ పోలీసులు పేర్కొంటున్నారు. 

More Telugu News