hardik pandya: హార్దిక్ పాండ్యపై కేక్ దాడి చేసిన సహచర క్రికెటర్లు... రివేంజ్ తీర్చుకుంటానన్న పాండ్య.. వీడియో చూడండి!

  • ఇటీవల పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న పాండ్య
  • సహచరుల సమక్షంలో కేక్ కటింగ్ 
  • పాండ్యపై కేక్ దాడి చేసిన సహచరులు
  • రివేంజ్ తీర్చుకుంటానన్న పాండ్య
టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సహచరులపై ‘కేక్‌ రివేంజ్‌’ తీర్చుకుంటానని సోషల్ మీడియా సాక్షిగా శపథం చేశాడు. ఇటీవల పాండ్య తన 24వ పుట్టిన రోజు వేడుకను సహచరుల సమక్షంలో కేక్ కోసి జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పాండ్య కేక్ కోస్తుండగానే అక్షర్ పటేల్.. పాండ్య తలకు కేక్ రాయగా, మనీష్ పాండే చేతికి అందినంత కేక్ ను తీసుకుని అతని ఒంటికి పులిమాడు.

ఇంతలో యజువేంద్ర చాహల్ చేతుల నిండా కేక్ తీసుకుని పాండ్య ముఖానికి రాసేశాడు. రోహిత్ శర్మ కేక్ ముక్క తీసుకుని దూరం నుంచే అతని మొహం మీదకు కొట్టాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన పాండ్య, ఏడాదిలో ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు వేడుక చేసుకోవాల్సిందేనని, స్వీట్ రివేంజ్ తీర్చుకునే అవకాశం తనకు కూడా వస్తుందని, అంతా సిద్ధంగా ఉండాలని, 'కేక్ రివేంజ్' తీర్చుకుంటానని కామెంట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిని మీరు కూడా చూడండి. 
hardik pandya
birthday
celebrations
team India

More Telugu News