maheshbabu: 'భరత్ అను నేను' రిలీజ్ డేట్ ఫిక్సయినట్టే!

  • కొరటాల దర్శకత్వంలో 'భరత్ అను నేను' 
  • ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు
  • కథానాయికగా కైరా అద్వాని 
  • సంక్రాంతి బరిలో లేనట్టే    

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కైరా అద్వాని కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.

 ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారనే టాక్ ఓ వైపున వినిపిస్తుంటే, వేసవి సెలవులకు రిలీజ్ చేయనున్నారనే వార్తలు మరో వైపున షికారు చేస్తున్నాయి. దాంతో అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే విషయం స్పష్టమవుతోంది.     

  • Loading...

More Telugu News