Errabelli Dayakar Rao: మంత్రి పదవిని చేపడతా: ఎర్రబెల్లి దయాకర్ రావు

  • పాలకుర్తి నుంచి వేరే నియోజకవర్గానికి వెళుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు
  • నేను ఇక్కడే పోటీ చేస్తా... ఇక్కడే గెలుస్తా
  • పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకుంటున్నా

రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి నుంచే పోటీ చేసి, గెలుపొందుతానని... ఆ తర్వాత మంత్రి పదవిని చేపడుతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కష్టకాలంలో తనను పాలకుర్తి ప్రజలు ఆదరించారని చెప్పారు. ఈ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి వెళ్లిపోతున్నానంటూ కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పాలకుర్తి ప్రజల రుణాన్ని తీర్చుకోవడం కోసం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22న వస్తున్నారని... ఈ సందర్భంగా జరిగే భారీ బహిరంగసభకు 20 వేల మందిని తరలిస్తున్నామని తెలిపారు.

More Telugu News