virat kohli: విరాట్ కొహ్లీ అభిమాన గాయ‌కుడు ఈయ‌నే!

  • అరిజీత్ సింగ్ పాట‌ల‌కు విరాట్ పెద్ద అభిమాని
  • గాయ‌కుడితో ఫొటో దిగిన క్రికెట‌ర్‌
  • ట్వీట్ చేసిన విరాట్

త‌న అభిమాన గాయ‌కుడు ఎవ‌ర‌నే విష‌యాన్ని భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ త‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. గాయ‌కుడు అరిజీత్ సింగ్‌తో దిగిన ఫొటోను విరాట్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. `నా అభిమాన గాయ‌కుడిని క‌లిశాను. ఆయ‌న చాలా గొప్ప వ్య‌క్తి. ఈయ‌న చేసిన‌ట్లుగా ఇంత‌వ‌ర‌కు ఏ గాయ‌కుడు న‌న్ను మంత్ర‌ముగ్ధుడిని చేయ‌లేదు!` అని విరాట్ ట్వీట్ చేశాడు.

`ఆషికీ 2` చిత్రం ద్వారా అరిజీత్ సింగ్‌ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత అన్ని ర‌కాల ప్రేమ పాట‌ల‌కు అరిజీత్ చిరునామాగా మారాడు. అరిజీత్‌ తెలుగులో `మ‌నం` చిత్రంలో `క‌నులను తాకే ఓ క‌ల‌` పాట పాడాడు.

More Telugu News