roja: నారాయణ, గంటాలను సస్పెండ్ చేయండి: రోజా డిమాండ్

  • విద్యార్థుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసిన రోజా
  • నారాయణ, చైతన్య విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన రోజా
  • నారాయణను గంటా రక్షిస్తున్నారు 

నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా నిలదీశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, విశాఖపట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిందిత కాలేజీపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి కారణమైన నారాయణ, చైతన్య కాలేజీల యాజమాన్యాలకు ఏ శిక్షలు విధించారని అడిగారు.

48 మంది విద్యార్థులు ఈ కాలేజీల్లో మరణిస్తే విద్యాశాఖ మంత్రి కనీసం పట్టించుకోలేదని అన్నారు. కేవలం వియ్యంకుడన్న కారణంతో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. మంత్రి నారాయణను రక్షిస్తున్నారని ఆమె ఆరోపించారు. 48 మంది పిల్లలు మరణిస్తే మంత్రి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? అని ఆమె ప్రశ్నించారు.

కేవలం చంద్రబాబునాయుడు ఫొటోపై చెత్తవేశారన్న దానిపై ఐఏఎస్ అధికారిణితో విచారణకు ఆదేశించారే?... పిల్లల జీవితాలు హరిస్తున్న నారాయణ, చైతన్యలపై విచారణకు ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేశారని ఆమె ప్రశ్నించారు. తక్షణం మంత్రి వర్గం నుంచి గంటా, నారాయణలను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 

More Telugu News