mahanati: ఆకాశ వీధిలో అందాల జాబిలి... `మ‌హాన‌టి`లో కీర్తి సురేశ్ ఫ‌స్ట్‌లుక్‌!

  • సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేశ్‌
  • ఇవాళ కీర్తి పుట్టిన‌రోజు
  • ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్‌

అందాలతార కీర్తి సురేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `మ‌హాన‌టి` చిత్రంలో ఆమె పోషిస్తున్న సావిత్రి పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర‌యూనిట్ ఈ రోజు విడుద‌ల చేసింది. `ఆకాశ వీధిలో అందాల జాబిలి` పేరుతో పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెబుతూ కీర్తి ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. కేవ‌లం కీర్తి క‌ళ్లు మాత్రమే క‌నిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్ చూస్తే అది సావిత్రి ఫొటోనా? లేక కీర్తి ఫొటోనా? అని తేల్చుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతోంది.

దీన్ని బ‌ట్టి చూస్తే కీర్తి సురేశ్ ఆ పాత్ర‌లో ఎంతె‌లా ఒదిగిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌, `అర్జున్ రెడ్డి` జంట విజ‌య్ దేవ‌రకొండ, షాలిని పాండేలు కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి దుల్క‌ర్ స‌ల్మాన్ పోషిస్తున్న జెమినీ గ‌ణేష‌న్ పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.

More Telugu News