nani: దీపావళికి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫస్టులుక్

  • షూటింగు దశలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' 
  • నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వం 
  • కథానాయికగా సాయిపల్లవి
  • ఈ జంటపై ఆడియన్స్ లో ఆసక్తి      

మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ, వరుస విజయాలతో నాని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తున్నాడు. నాని సరసన కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు వుంది .. ఇక 'ఫిదా'తో సాయిపల్లవి సహజ నటి అనే పేరు తెచ్చుకుంది. అలాంటి ఈ జోడీని తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. చెరో హిట్ తరువాత చేస్తోన్న ఈ మూవీ, ఈ జంటకి మరో హిట్ ను అందించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హై క్లాస్ అమ్మాయితో ఈ 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలి మరి.        

More Telugu News