virendra sehwag: హ్యాపీ బర్త్‌డే జంబో.... అనిల్ కుంబ్లేకు విషెస్ చెప్పిన సెహ్వాగ్‌

  • ట్వీట్ చేసిన క్రికెట‌ర్‌
  • భార‌త జ‌ట్టుకు ధ‌నం లాంటి వాడ‌ని వ్యాఖ్య‌
  • 47వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన అనిల్ కుంబ్లే
భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్‌, కోచ్ అనిల్ కుంబ్లే ఈరోజు 47వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సంద‌ర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. `ధ‌న‌త్ర‌యోద‌శి రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న, భార‌త జ‌ట్టుకు ధ‌నం లాంటి అనిల్ కుంబ్లే భాయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. జై జై శివ్ శంభో... హ్యాపీ బ‌ర్త్‌డే జంబో` అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. వారి ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఫొటోను కూడా సెహ్వాగ్ షేర్ చేశాడు. సోష‌ల్ మీడియాలో క్రియాశీల‌కంగా ఉండే సెహ్వాగ్ దాదాపు అంద‌రు క్రికెట‌ర్లు, ప్ర‌ముఖుల పుట్టిన‌రోజుల‌కు విషెస్ చెబుతుంటారు.
virendra sehwag
anil kumble
birthday
tweet
wishes
jumbo

More Telugu News