telangana: కొల్లూరు సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు... ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య?

  • స్థానికుల సమాచారంతో ముగ్గురు యువతుల మృతదేహాలు గుర్తించిన పోలీసులు
  •  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తుండగా మరో రెండు మృతదేహాల గుర్తింపు
  • వారంతా ఒకే కుటుబానికి చెందిన వారిగా గుర్తింపు
హైదరాబాదులోని నార్సింగి దగ్గర్లోని కొల్లూరులో విషాదం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... కొల్లూరు గ్రామం సమీపంలో ముగ్గురు యువతుల మృతదేహాలను స్థానికులు ఈ ఉదయం గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. ఆ సమీపంలోనే ఒక కారులో ఓ పురుషుడు, పిల్లాడి మృతదేహాలు కనిపించాయి. వారంతా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కి చెందిన ఒకే కుటుంబ సభ్యులని గుర్తించారు. వారంతా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  
telangana
hydrabad
narsingi
sangareddy
ameenpur
damily dead

More Telugu News