butta renuka: బుట్టా రేణుకకు పచ్చ కండువా కప్పిన చంద్రబాబు!

  • టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
  • కర్నూలు అభివృద్ధికి కట్టుబడివున్నా
  • బుట్టాతో పాటు కొత్తపల్లి కూడా
అమరావతి, ఉండవల్లిలోని తన నివాసంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా పచ్చ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితం రేణుక, తన భర్త, అనుచరులతో కలసి సీఎం నివాసానికి చేరుకోగా, ఆమెను పలకరించిన చంద్రబాబు, పార్టీలోకి ఆహ్వానించారు. ఆపై ఆయన మాట్లాడుతూ, కర్నూలు అభివృద్ధికి తాను కట్టుబడి వున్నానని తెలిపారు.

బుట్టా రేణుకతో పాటు వైసీపీ నేత, సెంట్రల్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి ప్రకాశ్ రెడ్డి కూడా అధికార తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కాగా, అనంతపురం జిల్లా కీలక నేత గుర్నాథరెడ్డి కూడా టీడీపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, రేణుక భర్త బుట్టా నీలకంఠ గతంలోనే టీడీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి పార్టీ మనోబలాన్ని దెబ్బతీసేందుకే మలివిడత ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
butta renuka
chandrababu
karnool

More Telugu News