aamir khan: నేను అనుష్కను ప్రేమించడానికి కారణం ఇదే: విరాట్ కోహ్లీ

  • అనుష్కలో ఉన్న గొప్ప గుణం నిజాయతీ
  • నేను ప్రేమించడానికి ఇదే కారణం
  • ఆమిర్ షోలో వెల్లడించిన కోహ్లీ

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మలు చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తమ అనుబంధానికి సంబంధించి వీరిద్దరూ బహిరంగంగా చెప్పింది చాలా తక్కువే. తాజాగా జీటీవీలో ప్రసారం అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ షోలో వీరి రిలేషన్ షిప్ గురించి కొంతమేరకు స్పందించాడు కోహ్లీ. షో సందర్భంగా ఆమిర్, కోహ్లీల మధ్య జరిగిన సంభాషణ ఇది.

ఆమిర్: నాకు అనుష్క చాలా కాలంగా తెలుసు. ఆమెతో కలసి నటించాను కూడా. ఆమె చాలా గొప్పది. నేను నిన్ను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. అనుష్కలో నీకు నచ్చిన ఒక గొప్ప లక్షణం ఏమిటి?

కోహ్లీ: నాకు ఆమెలో అమితంగా నచ్చే గుణం.. ఆమె నిజాయతీ. ఈ లక్షణమే ఆమెను ప్రేమించేలా చేసింది. ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నా.

  • Loading...

More Telugu News