raviteja: గతంలో బన్నీ మాదిరిగానే ఈ సారి రవితేజ్ హిట్ కొడతాడు : దిల్ రాజు

  • రవితేజ తాజా చిత్రంగా 'రాజా ది గ్రేట్' 
  • తొలిసారిగా పోషించిన అంధుడి పాత్ర 
  • నిర్మాతగా దిల్ రాజు స్పందన      

అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'ఆర్య' ఒకటిగా కనిపిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా, బన్నీ ఫాలోయింగ్ ను అమాంతం పెంచేసింది. ముందుగా ఈ కథను రవితేజకు .. ఆ తరువాత ప్రభాస్ కి .. నితిన్ కి కూడా వినిపించారట.

 అయితే వీళ్లంతా కూడా కథ బాగుంది గానీ .. తమ బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాదంటూ సున్నితంగా తిరస్కరించారట. దాంతో బన్నీ దగ్గరికి వెళ్లిన ఈ కథ .. ఆయనకి ఒక రేంజ్ హిట్ తెచ్చిపెట్టింది. అలాగే రవితేజ చేసిన 'రాజా ది గ్రేట్' కథను కూడా చాలామంది హీరోలకి వినిపించడం జరిగిందని, అయితే ఈ సినిమాలో కథానాయకుడు అంధుడు కావడం వలన, ఎవరూ ఆసక్తిని చూపలేదని దిల్ రాజు చెప్పారు. గతంలో బన్నీ మాదిరిగానే .. ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.      

More Telugu News