vijay devarakonda: విజయ్ దేవరకొండకు జోడీగా కొత్త హీరోయిన్!

  • 'అర్జున్ రెడ్డి' ఓ సంచలనం 
  • విజయ్ దేవరకొండకి ఒక రేంజ్ లో క్రేజ్ 
  • చేతిలో అరడజనుకు పైగా సినిమాలు
  • గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లోను ఓ సినిమా  

'అర్జున్ రెడ్డి' ఈ స్థాయి గుర్తింపును తీసుకువస్తుందని హీరో విజయ్ దేవరకొండ ఊహించలేదు. ఈ సినిమా ఆయనకి సూపర్ హిట్ ను ఇచ్చింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ను పెంచింది. అరడజను పైగా కొత్త ప్రాజెక్టులను చేతిలో పెట్టింది. అలాంటి విజయ్ దేవరకొండ .. రాహుల్ అనే కొత్త దర్శకుడితో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.

విజయ్ దేవరకొండతో చేయడానికి చాలామంది హీరోయిన్స్ రెడీగా వున్నారు. అయినా ఈ సినిమాలోను ప్రియాంకా జవాల్కర్ అనే కొత్త అమ్మాయినే కథానాయికగా తీసుకున్నారు. ఈ సుందరికి ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉందట. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండతో జోడీ కట్టిన షాలినీ పాండే వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసిన ప్రియాంకా జవాల్కర్ దశ కూడా ఆ స్థాయిలో తిరుగుతుందేమో చూడాలి.     

More Telugu News