sai prajwala: తిరుపతిలో హోటల్ ముందు సాయి ప్రజ్వల... గుర్తించి పట్టించిన స్థానికులు!

  • రెండు రోజుల నాడు అదృశ్యమైన నారాయణ కాలేజీ విద్యార్థిని సాయి ప్రజ్వల
  • క్షేమంగానే ఉందని తిరుపతి పోలీసుల నుంచి సమాచారం
  • బయలుదేరి వెళ్లిన తండ్రి, మధ్యాహ్నం తరువాత పోలీసుల మీడియా సమావేశం

నారాయణ కాలేజీలో చదువుకోవాలని ఒత్తిడి పెడుతున్నారని, అక్కడ నరకం కనిపిస్తోందని లేఖ రాసి పెట్టి, ఇంట్లోంచి వెళ్లిపోయిన హైదరాబాద్ అమ్మాయి సాయి ప్రజ్వల క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఆమె తిరుగుతుండగా, అప్పటికే టీవీలో చూసిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆ వెంటనే అమ్మాయిని అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు, హైదరాబాద్ పోలీసులకు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రజ్వల తండ్రి హుటాహుటిన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఈ విషయంలో మధ్యాహ్నం తర్వాత తిరుపతి పోలీసులు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News