america: దక్షిణకొరియాతో కలిసి సైనిక డ్రిల్ మొదలుపెట్టిన అమెరికా... ఉత్తరకొరియా ఏం చేస్తుందిప్పుడు?

  • సైనిక విన్యాసాలు మొదలు పెట్టిన దక్షిణకొరియా, అమెరికా
  • విన్యాసాల్లో భాగమైన విమాన వాహకనౌక యూఎస్‌ఎస్ రొనాల్డ్ రేగాన్‌ తోపాటు 40 నౌకలు, వివిధ రకాలు హెలికాఫ్టర్లు
  • ఉత్తరకొరియాపై దాడికి సన్నాహకం కాదని ప్రకటించిన దక్షిణకొరియా

తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొరియన్ ద్వీపకల్పంలో దక్షిణకొరియాతో కలిసి అమెరికా సైనిక విన్యాసాలు మొదలుపెట్టింది. గత కొన్ని నెలలుగా ఉత్తరకొరియా, అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరకొరియాను బూడిద చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తే, అమెరికా తమ లక్ష్యాలకు దగ్గర్లో ఉందని, హైడ్రోజన్ బాంబుతో దాని పీచమణుస్తామని ఉత్తరకొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో దక్షిణకొరియాతో పాటు అమెరికా నేవీ డ్రిల్స్ మొదలుపెట్టింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నిన్న ప్రారంభమైన ఈ డ్రిల్స్ ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. విమాన వాహకనౌక యూఎస్‌ఎస్ రొనాల్డ్ రేగాన్‌ తోపాటు 40 నౌకలు, వివిధ రకాల హెలికాఫ్టర్లు విన్యాసాలు నిర్వహించనున్నాయి.

అయితే, ఇది ఉత్తరకొరియాపై దాడికి సన్నాహకం ఎంతమాత్రమూ కాదని, సాధారణంగా జరిగే డ్రిల్ అని దక్షిణ కొరియా ప్రకటించింది. గతంలో అమెరికా ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా గువామ్ ద్వీపాన్ని నేలమట్టం చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరి, దీనిపై ఉత్తరకొరియా స్పందించాల్సి ఉంది.  

More Telugu News