England: ఇంగ్లండ్, ఐర్లాండ్, ఇజ్రాయెల్ దేశాల ప్రజలకు తీవ్ర తుపాను హెచ్చరిక!

  • 1987 నాటి భయంకరమైన తుపాన్ ను చూడబోతున్నారని హెచ్చరించిన అంతర్జాతీయ వాతావరణ విభాగం
  • బ్రిటన్, ఐర్లాండ్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు హెచ్చరికలు 
  • అప్రమత్తమైన వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రజలు
  • వణికిస్తున్న ఒలిఫియా తుపాను సమాచారం

ఇటీవలి కాలంలో ఏదో ఒక దేశంలో వరుస తుపానులు ఏర్పడుతూ ప్రజలను భయపెడుతున్నాయి. ఈ మధ్యే 'ఇర్మా' అమెరికాలోని ఫ్లోరిడా, ప్యుటోరికా, టెక్సాస్ రాష్ట్రాలను బెంబేలెత్తించగా, తాజాగా బ్రిటన్, ఐర్లాండ్, ఇజ్రాయెల్ తో పాటు మరికొన్ని దేశాలకు అంతర్జాతీయ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఒలిఫియా తుపాను ఆయా దేశాలను వణికించబోతోందని హెచ్చరించింది. దీంతో ఆయా దేశాలలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరికలు జారీచేశాయి.

 అంతర్జాతీయ వాతావరణ విభాగం చెప్పిన ప్రకారం, 1987లో సంభవించిన అతిభయంకరమైన తుపాన్‌ ను మళ్లీ చూడబోతున్నామని చెప్పింది. ఆయా దేశాల తీర ప్రాంతాల్లో ఇప్పటికే 90 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో ఆయా దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. దీంతో వేల మంది ప్రయాణికులు వివిధ దేశాల ఎయిర్‌ పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు.

అలాగే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా లేదని తెలుస్తోంది. దీంతో వివిధ ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఇంగ్లండ్ లోని గాల్వే సిటీపై తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని హోటళ్లు కోతకు గురికాకుండా ఉండేందుకు వాటి నిర్వాహకులు ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు.

More Telugu News