modi: మోదీని ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్‌తో పోల్చిన యూపీ వ్యాపారులు.. కేసు నమోదు

  • మోదీపై ఉత్తరప్రదేశ్ వ్యాపారుల వినూత్న నిరసన
  • మోదీని కిమ్‌తో పోలుస్తూ హోర్డింగులు
  • వ్యాపారాలను నాశనం చేస్తున్నారని  ఆరోపణ

ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్‌తో పోల్చిన ఉత్తరప్రదేశ్ వ్యాపారులపై కేసు నమోదైంది. చిల్లర డబ్బులను డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు నిరాకరిస్తుండడంపై గత కొంతకాలంగా కాన్పూర్ వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల తీరుతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొంటూ మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ  నిరసనను వ్యక్తం చేసేందుకు తాజాగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. అందులో ఓవైపు కిమ్ ఫొటో, మరోవైపు ప్రధాని ఫొటో వున్నాయి. ప్రపంచాన్ని నాశనం చేసిన తర్వాతే విశ్రాంతి తీసుకుంటా.. అని కిమ్ అన్నట్టు, మరోవైపు వ్యాపారాన్ని పూర్తిగా అంతం చేస్తానని మోదీ అన్నట్టుగా వాటిపై ముద్రించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు హోర్డింగులు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

More Telugu News