josh dunstan: బౌలర్లకు చుక్కలు చూపించాడు.. 40 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ బాదాడు

  • విరుచుకుపడ్డ ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్
  • ట్రిపుల్ సెంచరీలో 240 పరుగులు సిక్సర్ల ద్వారానే
  • అచ్చెరువొందిన ప్రేక్షకులు
ఆస్ట్రేలియాకు చెందిన జోష్ డన్ స్టన్ అనే క్లబ్ క్రికెటర్ (బీ గ్రేడ్ క్రికెటర్) బౌలర్లకు చుక్కలు చూపించాడు. సింగిల్స్ తీసినంతగా సిక్సర్లను బాదుతూ కొనసాగిన అతని ఆటతీరుకు అందరూ అచ్చెరువొందారు. ఓ క్లబ్ మ్యాచ్ సందర్భంగా ఆకాశమే హద్దుగా చెలరేగిన డన్ స్టన్ 307 పరుగులతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఏకంగా 40 సిక్సర్లు బాదాడు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఐదుగురు బ్యాట్స్ మెన్లు అందరూ కలిపి 47 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన డన్ స్టన్ బౌలర్లకు దడ పుట్టించాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే... డన్ స్టన్ స్కోరు 203 పరుగుల నుంచి 307కు చేరుకునే సమయంలో అవతలి ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ చేసిన స్కోరు కేవలం ఐదు పరుగులు మాత్రమే.
josh dunstan
australia cricket
40 sixers

More Telugu News