rajashekar: పవన్ కల్యాణ్ కు నా మీద చాలా కోపం... అందుకే అలా చూపించాడు: రాజశేఖర్

  • గబ్బర్ సింగ్ 'ఏం చేస్తిరి'పై రాజశేఖర్
  • అది నాకు వార్నింగే
  • జరిగిన విషయం చెప్పినందునే నాపై కోపం
  • హీరో రాజశేఖర్
గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ సన్నివేశంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తనను ఇమిటేట్ చేయడంపై హీరో రాజశేఖర్ మరోసారి స్పందించారు. తన నూతన చిత్రం 'గరుడవేగ' కోసం ప్రమోషన్ చేసుకుంటున్న ఆయన, ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు తనంటే చాలా కోపమని చెప్పాడు. ఆ కోపాన్ని అలా తీర్చుకున్నాడని అన్నాడు.

 "ఆయనకు నాపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నారు. అంతే... అందులో అన్నీ ఓకే, కానీ లాస్టులో తిట్టుంటారు. అలా డ్యాన్స్ చేపిస్తారు. డ్యాన్స్ చేపించిన తరువాత ఏం చేస్తిరి... ఏం చేస్తిరి.. ఏంటి? అని అలీ ఏదో వచ్చి మాట్లాడినట్టు చూపిస్తారు. ఆయన కోపాన్ని... ఏంట్రా... చూస్కో అన్నట్టు, నాకు వార్నింగ్ ఇచ్చినట్టు, నన్ను తిట్టినట్టు... నాకు అది ఆయన చేశాడు. నాకు అదే బాధ కలిగింది. ప్రజారాజ్యం పార్టీ... అందులో విషయాలు. ఆయన గురించి జరిగిన విషయాలు నేను చెప్పాను. అదే ఆయనకు నాపై కోపం అనుకుంటాను" అని అన్నాడు.
rajashekar
jeevita
garudavega
shivani
pawan kalyan

More Telugu News