rajashekar: నా కుమార్తె శివానీ హీరోయిన్ అవుతుంది: రాజశేఖర్

  • ప్రస్తుతం కథలు వింటోంది
  • రెండు మూడు కథలు బాగున్నాయి
  • మూడు నెలల్లో మరింత స్పష్టత
  • హీరో రాజశేఖర్

తన కుమార్తె శివానీ సినీ రంగ ప్రవేశంపై హీరో రాజశేఖర్ మరింత వివరణ ఇచ్చాడు. శివానీకి సినిమాల్లో నటించడం అంటే ఇష్టమని, తొలి సినిమా కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానని అన్నారు. "ఆ అమ్మాయికి కూడా నాలాంటి కోరికలే ఉన్నాయి. మంచి సబ్జెక్ట్ చేయాలి. విషయం ఉన్న సబ్జెక్ట్ చేయాలి. ఊరికే ఆకతాయిగా ఉన్న సబ్జెక్ట్ చేయకూడదు. ఇట్లా... సబ్జెక్ట్స్ వింటూ ఉంది. ఒకటి రెండు మేము కూడా అనుకుంటున్నాం. కొన్ని నచ్చాయి. ఏది ముందుకు వస్తది, ఏది సెకండ్, థర్డ్ అన్నది తెలియదుగానీ, రెండు మూడు నెలల్లో తెలుస్తది" అన్నారు. తన బిడ్డ సినీ రంగ ప్రవేశం ఖాయమేనని, ఆ విషయాలన్నీ తనకన్నా జీవితకు బాగా తెలుసునని చెప్పారు.

  • Loading...

More Telugu News