KTR: 'కామ్ కర్నేకా తరీఖా రహాతా హై'... వరంగల్ నగర కమిషనర్ శ్రుతి ఓఝాకు కేటీఆర్ క్లాస్!

  • యే టీక్ నహీహై... అంటూ అసహనం
  • కమిటీలతోనే కాలం గడుపుతారా?
  • నా దృష్టికి తీసుకురారా?
  • శ్రుతితో కేటీఆర్

వరంగల్ జిల్లా అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆమ్రపాలిపై 'డోంట్ ఆర్గ్యూ' అంటూ అసహనాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, తన ప్రశ్నలకు సరైన వివరణ ఇవ్వలేకపోయిన నగర కమిషనర్ శ్రుతి ఓఝాకూ క్లాస్ పీకారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై శ్రుతి వివరిస్తున్న సమయంలో "స్మార్ట్ సిటీ అంటే ఏంటి? ఎస్టీవీ కమిటీ ఏర్పాటు మాత్రమేనా? ఏడాదికిపైగా కమిటీ ఏర్పాటుతోనే కాలం గడిపారు. పనులు ఆలస్యమవుతున్నాయని నా దృష్టికి తీసుకువచ్చారా?" అని అన్నారు.

తన అసంతృప్తిని శ్రుతి మాతృభాషైన హిందీలోనే తెలియజేస్తూ, "యే టీక్ నహీహై... కామ్ కర్నేకా తరీఖా రహాతా హై" (ఇది సరైంది కాదు. పని చేసేందుకు ఓ పద్ధతి ఉంటుంది) అని అన్నారు. ఆమెతో మాట్లాడిన సమయంలో ఎక్కువసేపు కేటీఆర్ హిందీలోనే మాట్లాడారు.

More Telugu News