trump: ఆ రెండు దేశాల కలలు కల్లలే: డొనాల్డ్ ట్రంప్

  • ఇరాన్, ఉత్తర కొరియాలపై విరుచుకుపడ్డ ట్రంప్
  • నార్త్ కొరియా అణు పరీక్షలను లెక్క చేయబోము
  • గువామ్ పై దాడి అంత తేలిక కాదు
  • సమయం వస్తే తగిన గుణపాఠం: ట్రంప్

అమెరికాను భయపెట్టాలని ఓ వైపు నుంచి ఉత్తర కొరియా, మరో వైపు నుంచి ఇరాన్ దేశాలు కలలు కంటున్నాయని, వాటి కలలు నెరవేరే సమస్యే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ రెండు దేశాల నేతలూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించిన ట్రంప్, కొరియా అణు పరీక్షలను తాము లెక్క చేయబోవడం లేదని అన్నారు.

ఇరాన్ పూర్తి ఉగ్రవాద దేశంగా మారేలా అడుగులు వేస్తోందని ఆరోపించిన ట్రంప్, అమెరికాను భయపెట్టాలని దుస్సాహసం చేస్తే, తగిన ఫలితాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు. గువామ్ పై దాడి చేయాలంటే, చెప్పినంత తేలిక కాదని, ఆ రెండు దేశాల ప్రతి అడుగునూ తాము నిశితంగా గమనిస్తున్నామని అన్నారు. సమయం వచ్చినప్పుడు వాటికి బుద్ధి చెప్పి తీరుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News